పితృతర్పణ విధిః
Pitru Tarpana Vidhi (Ancestor Water Offering)
Fill the blanks with names, gotram and the day’s details as needed. Get samvatsaram, tithi, nakshatram for your city →
అచమ్య | ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయనమః | ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓంపురుషోత్తమాయ నమః | ఓం అధోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓంజనార్ధనాయనమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః |
|పవిత్రం ధృత్వా || ( పవిత్రమును ధరించాలి)ఓం పవిత్ర వంతః మాశత | ( మంత్రం వచ్చిన వారు చదువుకొండి )
పునరాచమ్య|| ( మరల అచమనము చేయాలి ) : ఉత్తిష్ఠంతు భూత పిశాచాః. యతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | ( అని చెప్పి నీటిని వామ భుజ వెనుక వేయాలి. )
ప్రాణ యామము : ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓంతత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతిరోమృతం బ్రహ్మా భూర్భు వస్సు వరోమ్ || ( అని మనసులో జపిస్తూ ప్రాణాయామము చేయాలి )
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం | శ్రీ గోవింద గోవింద గోవింద |
(ఇక్కడ ఏ క్షేత్రంలో ఉంటే ఆ సంకల్పం చెప్పుకోవాలి గమనించగలరు)ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ |
ప్రాచీనావీతీ | ( యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము మీది మార్చుకొనవలెను )
ఆస్మత్ పితృణాం మాతామహాదీనాం సర్వేకారుణ్యానాం చ అక్షయ పుణ్యలోకావాప్త్యర్థం తీర్థాఖ్యాన్న శ్రాద్ధ ప్రతినిధి సద్యః తిల తర్పణం కరిష్యే సవ్యం||
సవ్యముగా ఎడమభుజము పైనకు యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.
ప్రాచీనావీ|| మరల ప్రాచీనావీతి చేసుకోవలెను. ముందుగా తూర్పుకొసలుగా మూడు దర్భలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలుపరచి వాటిపై పితృదేవతలను
ఓం అగచ్ఛంతు మేపితర ఇమం గృహ్ణంతు జలాంజలిమ్||" అని చెప్పుతూ తిలలు వేసి అర్పించవలెను.
దక్షిణముముఖగా తిరిగి, ఎడమ మోకాలు క్రింద ఆన్చి తర్పణ విడువ వలెను. "స్వధా నమస్తర్పయామి" అన్నప్పుడల్లా మూడు సార్లు తిలోదకము పితృతీర్థముగా ఇవ్వవలెను.
వారి భార్యకూడా లేనట్లైతే సపత్నీకం అని, స్త్రీల విషయమునకై భర్త కూడా లేనట్లైతే సభర్త్రుకాం అని చెప్పుకోవాలి.
క్రింద మొదటి ఖాళీలో గోత్రమును, రెండో చోట వారి పేరును చెప్పి తర్పణ చేయాలి.
ప్రతి దానికీ ముందు "అస్మత్" అని శబ్దాన్ని చేర్చవలెను.
బ్రాహ్మణులైతే శర్మాణం అని పనికోస్తుంది కానీ రాజులైతే వర్మాణం, వైశ్యులైతే గుప్తం, ఇతరులు దాసం అని మార్చి పలకాలి.
పితరం ( తండ్రి ) గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి||3||
పితామహం ( తాత ) గోత్రం శర్మాణం రుద్రరూపం స్వధానమస్తర్పయామి||3||
ప్రపితామహం ( ముత్తాత ) గోత్రం శర్మాణం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి||3||
మాతరం ( తల్లి ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
పితామహీం(నాయనమ్మ ) గోత్రాం పదాం రుద్రరూపాం స్వధానమస్తర్పయామి||3||
ప్రపితామహీం ( ముత్తమ్మ ) గోత్రాంపదాం ఆదిత్యరూపాం స్వధానమస్తర్పయామి||3||
సాపత్నీ మాతరం (సవతి తల్లి) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
మాతామహం ( తల్లి తండ్రి ) గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి||3||
మాతుః పితామహం ( తల్లి తాత ) గోత్రం శర్మాణం రుద్రరూపం స్వధానమస్తర్పయామి||3||
మాతుః ప్రపితామహం ( తల్లి ముత్తాత ) గోత్రం శర్మాణం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి||3||
మాతామహీం (అమ్మమ్మ ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
మాతుః పితామహీం ( తల్లికి నాయనమ్మ ) గోత్రాం పదాం రుద్రరూపాం స్వధానమస్తర్పయామి||3||
మాతుః ప్రపితామహీం( తల్లికి ముత్తమ్మ ) గోత్రాం పదాం ఆదిత్యరూపీం స్వధానమస్తర్పయామి||3||
ఆత్మపత్నీం ( భార్య ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
సుతం ( కుమారుడు ) గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి||3||
జ్యేష్ట/కనిష్ట భ్రాతరం ( సోదరులు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
జ్యేష్ట/కనిష్ట పితృవ్యం ( తండ్రి సోదరులు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
మాతులం ( మేనమామ ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
దుహితరం ( కుమార్తె ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
భగినీం ( తోబుట్టువు ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
దౌహిత్రం ( కూతురి కొడుకు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
భాగినేయకం ( మేనల్లుడు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
పితృభగినీం ( మేనత్త ) గోత్రాం పదాం వసురూపాం (సభర్త్రుకాం) స్వధానమస్తర్పయామి||3||
మాతృభగినీం ( తల్లి తోబుట్టువు ) గోత్రాం పదాం వసురూపాం (సభర్త్రుకాం) స్వధానమస్తర్పయామి||3||
జామాతరం ( అల్లుడు ) గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి||3||
భావుకం ( బావగారు ) గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి||3||
స్నుషాం ( కోడలు ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
శ్వశురం ( భార్య తండ్రి ) గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి||3||
శ్వశ్రూం ( భార్య తల్లి ) గోత్రాం పదాం వసురూపాం స్వధానమస్తర్పయామి||3||
శ్యాలకం ( భార్య సోదరుడు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
స్వామినం ( ప్రభువు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
గురుం ( గురువు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
రిగ్ధినం ( ధనమిచ్చినవారు ) గోత్రం శర్మాణం వసురూపం (సపత్నీకం) స్వధానమస్తర్పయామి||3||
యజ్ఞోపవీతమును దండగా వేసుకొని బ్రహ ముడిని నీటిలో ముంచి పిండుతూ క్రింది విధంగా చదువవలెను.
||శ్లో|| యేకేచాస్మత్ కులేజాతా అపుత్రా గోత్రుణోమృతాః|
తేగృహ్ణంతు మయాదత్తం సూత్ర నిష్పీడనోదకం||
నాకులుములోను, గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరు గాక! )
శ్రీరామ రామ రామ|| అనుచూ యజ్ఞోపవీతపు ముళ్ళను కళ్ళకద్దుకుని సవ్యము చేసుకో నవలెను.
తూర్పు తిరిగి చేతికి పెట్టుకున్న పవిత్రమును విసర్జించి ఆచమనము చేసి ఆ దర్భలను కూర్చలను విసర్జించవలెను
